నామినేషన్‌ తిరస్కరణపై సుప్రీంకు బహదూర్‌

tej bahadoor yadav
tej bahadoor yadav

న్యూఢిల్లీ: వారణాసి నుంచి ఎస్పి-బిఎస్పి-ఆర్‌ఎల్‌డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిఎస్‌ఎఫ్‌ మాజీ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సుప్రీంను ఆశ్రయించారు. తన నామినేషన్‌ను కావాలనే ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఆయన ఈ రోజు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐతే ఈ కేసు విషయంలో బహదూర్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించనున్నారు. ఐతే నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో సరైన సమాచారాన్ని పొందుపరచలేదని, కేంద్ర ప్రభుత్వ విధుల నుంచి తొలగించినట్లు ఆధారాలు సమర్పించడంలో యాదవ్‌ విఫలమయ్యారని పేర్కొంటూ ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం విదితమే.
బహదూర్‌ సరిహద్దు భద్రతా దళంలో జవానుగా విధులు నిర్వర్తించేవారు. అర్కడ జవాన్లకు నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ ఒక వీడియోను రూపొందించి, దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిని క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన బిఎస్‌ఎఫ్‌ ఆయన్ను విధుల నుంచి తొలగించింది. అనంతరం వారణాసిలో మోదిపై పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/