అందుకే తేజ్‌బహదూర్‌ నామినేషన్‌ తిరస్కరించాం

Election Returning Officer
Election Returning Officer

్డవారణాసి: తేజ్‌బహదూర్‌ నామినేషన్‌ తిరస్కరణపై వారణాసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. అయితే ఎవరైనా వ్యక్తి గత ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వ లేదా కేంద్రప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగించబడినపుడు..ఆ వ్యక్తి అవినీతికి పాల్పడటం, విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడలేదనే విషయాన్ని ధృవీకరిస్తూ ఈసీ సర్టిఫికెట్ జారీచేస్తుంది. అయితే ఆ సర్టిఫికెట్‌ను తేజ్‌బహదూర్ యాదవ్ మంగళవారం ఉదయం 11 గంటలలోపు సమర్పించలేదు. అందుకే ఆయన నామినేషన్‌ను తిరస్కరించామనిఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అధికారులు అడిగిన అన్ని సాక్ష్యాధారాలు అందజేసినప్పటికీ, నామినేషన్ చెల్లదని చెప్పారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తేజ్‌బహదూర్ తరపు న్యాయవాది రాజేశ్ గుప్తా చెప్పారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/news/national/