నితిన్‌ గడ్కరి ఎక్కిన విమానంలో సాంకేతిక లోపం

Nitin Gadkari
Nitin Gadkari

నాగపూర్‌: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి ఈరోజు ఉదయం ఎక్కిన ఇండిగో విమానంలో సాంకేతక లోపం తలెత్తింది. నాగపూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన 6ఇ 636 ఇండిగో విమానం కొద్ది నిమిషాల్లో టేకాఫ్ తీసుకుంటుందనగా అందులో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలెట్ గుర్తించారు. దీంతో గడ్కరి సహా ప్రయాణికులందరినీ ఖాళీ చేయించి విమానాన్ని రన్‌వే నుంచి టాక్సీవే వైపు వెనక్కి తీసుకెళ్లారు. సాంకేతిక లోపం వల్లే విమానం నిలిపివేసినట్టు నాగపూర్ విమానాశ్రయ సీనియర్ డెరెక్టర్ విజయ్ ములేకర్ తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/