అంగన్‌వాడీలో చేరిన కలెక్టర్‌ కూతురు

Tamil Nadu, Collector, Daughter, anganwadi school
Tamil Nadu, Collector, Daughter, anganwadi school

 చెన్నై: తమ పిల్లలు ప్రయివేటు స్కూళ్లల్లో చదివించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఓ కలెక్టర్‌ మాత్రం తన బిడ్డను అంగన్‌ వాడీ సెంటర్లో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అంగన్‌వాడీలు ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న పిల్లల పాఠశాలలు. ఈ సందర్భంగా కలెక్టర్ శిల్ప మాట్లాడుతూ.. సమాజంలోని అందరి పిల్లల మాదిరిగానే తన బిడ్డను పెంచాలనుకుంటున్నానని, అన్ని వర్గాలతో కలిసిపోయే విధంగా తన కుమార్తె పెరగాలని చెప్పారు. ఈ కారణంతోనే తాను నర్సరీ స్కూల్ స్థానంలో అంగన్ వాడీ సెంటర్ ను ఎంపిక చేసుకున్నానని స్పష్టం చేశారు.