వెర్సోవా బీచ్ లో చెత్తను తొలగించి స్వీడన్ రాజ దంపతులు

ఐదు రోజుల భారత పర్యటనకు విచ్చేసిన రాజ దంపతులు

Sweden royal couple
Sweden royal couple

ముంబయి: భారత పర్యటనకు విచ్చేసిన స్వీడన్ రాజ దంపతులు కింగ్ కార్ల్ గుస్తాఫ్, క్వీన్ సిల్వియా ముంబయిలో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా వారు ముంబయిలోని వెర్సోవా బీచ్ లో చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు క్లైమేట్ యాక్టివిస్ట్, లాయర్ అఫ్రోజ్ షా కూడా పాల్గొన్నారు. రెండేళ్ల క్రితం ఈ బీచ్ ను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని అఫ్రోజ్ ప్రారంభించారు. ఒంటరిగానే ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టినప్పటికీ… ప్రస్తుతం ఈ కార్యక్రమంలో 12 వేల మంది వాలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీచ్ క్లీనప్ ప్రాజెక్టుగా ఇది పేరు తెచ్చుకుంది. వీరు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ప్రధాని మోడి కూడా ప్రశంసించారు. బీచ్ ను శుభ్రం చేసే సందర్భంగా వాలంటీర్లతో కూడా రాజ దంపతులు ముచ్చటించారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/