సూరత్‌ కోచింగ్‌ సెంటర్‌ యజమాని అరెస్టు

fire accident
fire accident

సూరత్‌: సూరత్‌లోని తక్షశిల వాణిజ్య సముదాయంలో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 20 మంది విద్యార్ధులు బలయ్యారు. ఐతే గుజరాత్‌ పోలీసులు ఫైర్‌ సేఫ్టీ పాటించని కోచింగ్‌ సెంటర్‌ యజమానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో దాదాపు 50 మంది విద్యార్దులున్నట్లు సమాచారం. అందులో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కొందరు అగ్నికీలలకు సజీవ దహనం కాగా, ప్రాణభయంతో కిందికి దూకి మరికొందరు మృతిచెందారు. గాయపడిన మరికొందరు విద్యార్ధులకు ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై సియం విజ§్‌ు రూపాని ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ భవనాన్ని నిర్మించిన హర్షల్‌ వకారియా, జిగ్నేష్‌లతో పాటు కోచింగ్‌ సెంటర్‌ యజమాని భార్గవ్‌ భూటానిలపై కేసు కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారని, ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేవా అనేదానిపై విచారణ జరుగుతుందని ఉపముఖ్యమంత్ర నితిన్‌ భా§్‌ు పేర్కోన్నారు. ఐతే ఈ ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే జరిగినట్లు భావిస్తున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/