డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టు ఊరట

D. K. Shivakumar
D. K. Shivakumar

ఢిల్లీ: కర్నాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాగా మనీలాండరింగ్‌ కేసులో గతనెలలో ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన విషంయం తెలిసిందే. అయితే ప్రతిగా ఆయన ఈ కేసులో ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని బెయిల్‌ రద్దు చేయాలంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. మాజీ కేంద్రమంత్రి చిదంబరం కేసులో ఎలాంటి వాదనను వినిపించారో సరిగ్గా అలాంటి వాదననే ఏ విధమైన మార్పు లేకుండా వినిపిస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/