‘మోడి’ బయోపిక్‌ చూడమని ఈసీకి సుప్రీం ఆదేశం

modi-biopic,supreme-court
modi-biopic,supreme-court

న్యూఢిల్లీ: ప్రధాని మోడి జీవితాధారంగా వస్తున్న ‘పిఎం నరేంద్రమోడి’ బయోపిక్‌ను ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం చూడాలని ఈరోజు సుప్రీం కోర్టు ఈసీని ఆదేశించింది. అయితే ఎన్నికల ముందు ఎలాంటి బయోపిక్‌లను ప్రదర్శించడానికి వీల్లేదని కొన్ని రోజుల క్రితం ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో పీఎం నరేంద్ర మోడి చిత్రబృందం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సినిమా చూడాల్సిందిగా ఆదేశించింది. ఆ తర్వాత సినిమా విడుదల చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందా? లేదా? అన్నది ఈసీనే నిర్ణయించాలని పేర్కొంది. సినిమా చూశాక ఏప్రిల్‌ 22లోగా అభిప్రాయాన్ని సీల్డ్‌ కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాలని చెప్పింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/