నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం

రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంపై ముఖేశ్ సింగ్ రివ్యూ పిటిషన్

Supreme Court of India
Supreme Court of India

న్యూఢిల్లీ: నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలు వాయిదా పడేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తనకు సంబంధించిన మొత్తం రిపోర్టులను పంపించలేదని… అందుకే తనకు క్షమాభిక్షను ఏకపక్షంగా తిరస్కరించారని పిటిషన్ లో ముఖేశ్ పేర్కొన్నాడు. మొత్తం డాక్యుమెంట్లను రాష్ట్రపతికి పంపించాలని… జైల్లో తనను కొట్టారని, లైంగికంగా వేధించారనే విషయాన్ని తాను నిరూపించుకుంటానంటూ కూడా ముఖేశ్ సింగ్ తన పిటిషన్ లో కోరాడు. ఈ పిటిషన్ పై నిన్న వాదనలను విన్న ధర్మాసనం… తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు విచారణను చేపట్టిన ధర్మాసనం… ముఖేశ్ సింగ్ పిటిషన్ ను కొట్టి వేసింది. పిటిషన్ లో ముఖేశ్ కుమార్ పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రపతికి అన్ని డాక్యుమెంట్లు పంపించలేదనే ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/