కేంద్రానికి, ఈసీకి సుప్రీం నోటీసులు జారీ

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విధులు నిర్వహిచడంలో ఆలస్యం వహిస్తున్నారాన్ని నోటీసులు జారీ చేసింది. అయితే ఎన్నికల కోడ్‌ నియామావళికి సంబంధించిన వ్యాఖ్యలపై పరిశీలిస్తున్నామని ఈసీ సమాధానం ఇచ్చింది. కాగా నేతలపై వెంటనే చర్యలు తీసుకోలేమని ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈసీ సమాధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాయావతి, యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్‌ దాఖలైంది. అధికారులను ఈసీ పూర్తిగా వినియోగించుకోలేకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈసీ తరపున అధికారి రేపు కోర్టుకు హాజరుకావాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/