ఎమ్మెల్యెల రాజీనామాలపై సుప్రీంలో విచారణ

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. తమ పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతోనే స్పీకర్ వారి రాజీనామాలు ఆమోదించలేదని న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. రూల్స్ ప్రకారం.. పదువుల్లో ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవచ్చునని, కానీ వారు ముందే తమ పదవులకు రాజీనామా సమర్పించారని చెప్పారు. ఈనెల 6వ తేదీన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాజీనామా పత్రాలు అందజేయగా.. 10వ తేదీన వారిపై అనర్హత వేటు వేయాలంటూ పార్టీలు స్పీకర్‌ను కోరాయని తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/