అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ల తిరస్కరణ

Supreme court
Supreme court

న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై గతంలో 18 రివ్యూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. కాగా నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. ఈ పిటిషన్లను సాధారణ విధానాన్ని అనుసరించకుండా ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ చేపట్టింది. కాగా తీర్పుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కోరుతూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను సిజెఐ తిరస్కరించారు. సిజెఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలో రివ్యూ పిటిషన్లపై ప్రత్యేక ఛాంబర్‌లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అంతర్గత విచారణ జరిపింది. అనంతరం అయోధ్య తీర్పు వివాదంపై రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. కాగా ఈ తీర్పుపై తొలి రివ్యూ పిటిషన్‌ డిసెంబర్‌ 2న దాఖలైంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/