రాజీవ్‌ కస్టడీపై సీబీఐకి సుప్రీం ఆదేశం

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: కోల్‌కతా పోలీస్‌ మాజీ కమిషనర రాజీవ్‌ కుమార్‌ను కస్టోడియల్‌ విచారణకు అప్పగించడానికి తగిన ఆధారాలు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈరోజు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని విచారణ జరిపింది. సీబీఐ తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. న్యాయ పరిరక్షణ దృష్ట్యానే ఆయన కస్టడీని కోరుతున్నామని వివరించారు. అయితే శారదా చిట్‌ ఫండ్‌ కుంభకోణ కేసుకు సంబంధించిన ఆధారాలను రాజీవ్‌ ధ్వంసం చేశారనడానికి గల సాక్ష్యాలను కోర్టు ముందుంచాలని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. విచారణ సమయంలో రాజీవ్‌ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని తుషార్‌ మెహతా కోర్టుకు వివరించారు. ఒక రోజు సమయం ఇస్తే రాజీవ్‌ కుమార్‌ కస్టడీ ఎంత అవసరమో సాక్ష్యాధారలతో సహా కోర్టుకు తెలియజేస్తామని తెలిపారు. దీంతో దీనిపై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/