పుదుచ్చేరి ఎమ్మెల్యేకు సుప్రీం నోటీసులు

supreem court
supreem court


న్యూఢిల్లీ: పాండిచ్చేరి గవర్నమెంట్‌ వర్సెస్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ లక్ష్మీనారాయణకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడి కల్పించేకుంటున్నారంటూ లక్ష్మీనారాయణన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా..రోజు వారీ ప్రభుత్వ కార్యక్రమాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కల్పించుకోకూడదంటూ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ..కిరణ్‌ బేడి సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగగా..వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/