నా తరపున సమావేశాలకు ఆయనే హాజరవుతారు!

Sunny Deol
Sunny Deol

గురుదాస్‌పూర్‌: లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుండి బిజెపి తరపున్న ప్రముఖ బాలావుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌ ఎంపిగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎంపిని నినైనా సమావేశాలకు మాత్రం తాను నియమించే మరోవ్యక్తి హాజరవుతారని సన్నీ దేవోల్‌ ఈరోజు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. మొహాలి జిల్లా పల్హేరీ గ్రామానికి చెందిన గురుప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని నా ప్రతినిధిగా నియమిస్తున్నాను. ఇక నుంచి నా నియోజకర్గానికి సంబంధించి జరిగే అన్ని సమావేశాలు, కార్యక్రమాలకు నా తరఫున ఆయనే హాజరవుతారు అని లేఖలో సన్నీ దేవోల్‌ పేర్కొన్నారు. కాగా సన్నీ దేవోల్‌ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. దీంతో ఎంపి సన్నీ దేవోల్‌ స్పందించిన ఆయన ప్రతినిధి గురుప్రీత్‌ సింగ్‌ కేవలం స్థానిక సమస్యల పరిష్కారం కోసమే సన్నీ తనని నియమించారన్నారు. ప్రతి నెల సన్నీనే స్వయంగా నియోజకర్గంలో పర్యటిస్తారన్నారు. 24 గంటలు ప్రజాసేవలో ఉండడంలో భాగంగా ఆయన ఇలా చేశారని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/