ఇటువంటి కామాంధులను ప్రజలకు అప్పగించాలి

రాజ్య సభలో తీవ్ర ఆగ్రహంతో మాట్లాడిన జయా బచ్చన్

Jaya-Bachchan
Jaya-Bachchan

న్యూఢిల్లీ: దిశ హత్యాచార ఘటన నేడు రాజ్య సభను కుదిపేసింది. సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్, తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు. ‘ఇటువంటి కామాంధులను ప్రజలకు అప్పగించాలి. అప్పుడు ప్రజలే వారిపై మూకదాడి చేసి చంపేస్తారు. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారుఖి అని ఆమె అన్నారు. జయా బచ్చన్ అనంతరం, అన్నా డీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ మాట్లాడుతూ, కన్నీరు పెట్టుకున్నారు. భారతావని మహిళలకు, చిన్నారులకు క్షేమకరంగా లేదని అన్నారు. ఎంతటి కఠిన నేరాలు చేసినా, నిందితులకు శిక్ష పడటం లేదని, వారిని జైళ్లలో పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/