వైగో రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లేఖ

Vaiko, subramanian swamy
Vaiko, subramanian swamy

న్యూఢిల్లీ: ఎండిఎంకే అధినేత వైగో ఇటీవలే డిఎంకే సహకారంతో రాజ్యసభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. హిందీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని వైగో ఉల్లంఘించారని లేఖలో రాశారు. హిందీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 351ని వైగో ఉల్లంఘించారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్‌ కమిటీకి అప్పగించాలని, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అర్హత వైగోకు ఉందో లేదో కమిటీనే నిర్ణయిస్తుందని చెప్పారు.
హిందీ అభివృద్ధి చెందిన భాష కాదని, హిందీలో రాసిన ఒకే ఒక పుస్తకం రైల్వే టైమ్‌ టేబుల్‌ మాత్రమేనని వైగో వ్యాఖ్యానించారని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. దేశ ప్రధాని పార్లమెంటులో ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని కూడా వైగో వ్యాఖ్యానించారని తెలిపారు. ఆర్టికల్‌ 351 ప్రకారం హిందీ జాతీయ భాషగా చెలామణి అవుతుందని అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/