డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు కోర్టు ఉత్తర్వులు!

mk stalin
mk stalin

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ శాఖ మంత్రుల గురించి, సుపరిపాలనలో తమిళనాడు మొదటి ర్యాంకు సాధించిన విషయంపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్టాలిన్‌పై పరువు నష్టం కేసు దాఖలైంది. అలాగే పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా విమర్శించారని స్టాలిన్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. వీటిని సోమవారం స్వీకరించిన జిల్లా ప్రన్సిపాల్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సెల్వకుమార్‌..సీఎంను విమర్శించడం, సీఏఏ చట్టం గురించి ప్రభుత్వాన్ని విమర్శించడం అనే రెండు కేసులో మార్చి 4వ తేదీ, మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ శాఖ మంత్రి విమర్శించిన కేసులో ఈ నెల 24న నేరుగా కోర్టులో హాజరుకావాలని స్టాలిన్‌కు సమన్లు జారీ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/