కేంద్రంపై స్టాలిన్ మండిపాటు

ఆర్థిక మందగమనాన్ని దాచి పెట్టేందుకు కశ్మీర్ అంశాన్ని వాడుకుంటోంది

MK Stalin
MK Stalin

హైదరాబాద్‌: కేంద్రం ప్రభుత్వంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిందని పేర్కొన్న ఆయన.. ఆర్థిక మందగమనాన్ని దాచి పెట్టేందుకు చిదంబరం అరెస్ట్, కశ్మీర్ అంశాలను కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందని, గత 27 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా.. ఆ వార్తలు మాత్రం అటు ప్రింట్ మీడియాలో కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రాకపోవడం దారుణమన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/