సింగపూర్‌లో శ్రీదేవి మైనపు విగ్రహం

Sridevi
Sridevi

సింగపూర్‌ : అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నట్టు టుస్సాడ్స్‌ సంస్థ తమ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ పలువురి సెలబ్రిటీల మైనపు విగ్రహాలని తయారు చేసి ప్రజల సందర్శనార్ధం సింగపూర్‌లోని మ్యూజియంలో ఉంచుతున్న నేపథ్యంలో.. తాజాగా వెండితెర అసమాన నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉంచేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేపట్టారు. సెప్టెంబర్‌ 4 ఉదయం శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు టుస్సాడ్స్‌ సంస్థ తమ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఈ కార్యక్రమం ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రసారం కానుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/