మోడి ప్రమాణస్వీకారానికి వీరే ప్రత్యేక అతిథులు!

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా మరోసారి మోడి ప్రమాణస్వీకారం గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి విదేశాల అధినేతలు, రాష్ట్రాల సిఎంలు, గవర్నర్లు, బిజెపి అగ్రనేతలు ఇంకా చాలా మంది ప్రముఖుల హాజరుకానున్నారు. అయితే వీరితో పాటు పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన బిజెపి కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా మోడి ప్రమాణస్వీకారానికి రానున్నారట. వీరిని ఖప్రత్యేక ఆహ్వానితులుగగా పిలిచినట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. ఈవిషయంపై మంగళవారం రాత్రి మోడి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మధ్య జరిగిన సుదీర్ఘ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానితుల జాబితా ఖరారవగా దాన్ని రాష్ట్రపతి భవన్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/