వద్రాకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూర్‌

Robert Vadra
Robert Vadra

హైదరబాద్‌: రాబర్డ్‌ వద్రాకు మనీల్యాండరింగ్‌ కేసులో స్పెషల్‌ సీబీఐ కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూర్‌ చేసింది. అంతేకాక వద్రా సన్నిహితుడు మనోజ్‌ ఆరోరాకు కూడా బెయిల్‌ను మంజూర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ కేసులో ఇద్ద‌రూ మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ఉన్నారు. ముంద‌స్తు బెయిల్ కోసం ఇద్ద‌రూ 5 ల‌క్ష‌ల ప‌ర్స‌న‌ల్ బాండ్ల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అనుమ‌తి లేకుండా వ‌ద్రా దేశం విడిచి వెళ్ల‌రాదు అని కోర్టు స్ప‌ష్టం చేసింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ల‌భించ‌డం ఒక‌ర‌కంగా వ‌ద్రాకు పెద్ద ఊర‌టే. ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ఈడీ స‌వాల్ చేయ‌నున్న‌ది. న్యాయ‌వ్య‌వ‌స్థ విజ‌యం సాధించింద‌ని వ‌ద్రా త‌ర‌పున వాదించిన అభిషేక్ మ‌ను సంఘ్వి తెలిపారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/