స్పీకర్‌దే తుది నిర్ణయం

న్యూఢిల్లీ: కర్నాటక అసంతృప్తి ఎంఎల్ఎల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. అసంతృప్తి ఎంఎల్ఎల తరుఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతోనే స్పీకర్ రాజీనామాలు ఆమోదించలేదని రోహత్గి కోర్టుకు తెలిపారు. రాజీనామాలు ఆమోదించడానికి స్పీకర్‌కు అభ్యంతరం ఏంటని కోర్టులో ప్రశ్నించారు. ఎంఎల్ఎల రాజీనామా అంశంలో స్పీకర్‌దే తుదినిర్ణయమని సిజెఐ స్పష్టం చేశారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్పీకర్ చేతుల్లో ఉందన్నారు. కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. కాంగ్రస్, జెడిఎస్‌కు సంబంధించిన ఎంఎల్ఎలు రాజీనామా పత్రాలు స్పీకర్ పంపించిన విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/