త్వరలో ఏపీకి శుభవార్త

ap cm chandrababu,  rajnath singh, modi
AP cm chandrababu, rajnath singh, modi

ఢిల్లీ : కోద్దిరోజుల క్రితం తితలీ తుఫానుతో సిక్కోలో విలవిలడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కేంద్రానికి తుఫాను బాధితులను మొత్తం రూ.3,435కోట్ల నష్టం వాటిల్లిందని లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్రం గురువారం సాయంత్రం హోంమంత్రి రాజనాథ్‌ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఇటీవల వరద ప్రభావానికి గురైన, కేరళ, నాగాలాండ్, ఏపీ రాష్టాలకు ఆర్ధిక సహాయంపై నిశితంగా చర్చించడం జరిగింది. ఫైనల్‌‌గా తితలీ తుఫాను నష్టపరిహారంగా ఏపీకి రూ. 539.52 కోట్లు మంజూరు చేసేందుకు కమిటీ నిర్ణయించింది. కాగా గురువారం రాత్రి లేదా శుక్రవారం మధ్యాహ్నం లోపు కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే .. తుఫాను బాధితులకు రూ.520కోట్ల రూపాయిలను పరిహారంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.