కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌గా సోనియా

Sonia Gandhi
Sonia Gandhi

న్యూఢిల్లీ: ఈరోజు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌గా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. సోనియా గాంధీ పేరును మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 సీట్లలో మాత్రం గెలిచింది. అయితే కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలన్నా మరో మూడు సీటుల తక్కువే ఉన్నాయి. కాగా కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఎన్నికైన వారే.. పార్ల‌మెంట్‌లో పార్టీ నేత‌ను ఎన్న‌కుంటారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/