గురుద్వారాపై దాడిని ఖండించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి నిందితులను అరెస్టయ్యేలా చూడాలి

Sonia Gandhi
Sonia Gandhi

న్యూఢిల్లీ: సిక్కుల పవిత్ర దేవాలయం అయినా నాన్‌కానా సాహిబ్‌లోని గురుద్వారాపై పాకిస్థాన్‌లో జరిగిన దాడిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. గురుద్వార వద్ద సిక్కు భక్తులు, ఉద్యోగుల భద్రత ఎంతో ఆందోళనకరంగా ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ అధికారులతో మాట్లాడి గురుద్వారా వద్ద భద్రత కల్పించాలని కోరారు. గురుద్వారపై దాడి చేసిన నిందితులను పాకిస్థాన్‌ వెంటనే అరెస్టు చేసేలా భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. కాగా పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్రా దేవాలయం గురుద్వారాపై శుక్రవారం కొందరు రాళ్లతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. సిక్కు వర్గానికి చెందిన ఓ యువతిని మరో వర్గం యువకుడు మత మార్పిడి చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతడి కుటుంబ సభ్యులు గురుద్వారాపై దాడికి పాల్పడ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/