తండ్రి హత్యకు దారితీసిన మొబైల్‌ గేమ్స్‌

murder
murder

కన్న తండ్రిని హతమార్చిన కొడుకు

బెంగళూరు: మొబైల్‌లో హెచ్‌జి గేమ్స్‌ ఆడకూడదని బుద్ధిమాటలు చెప్పిన కన్నతండ్రిని కొడుకు మూడు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశాడు. తండ్రి శంకరప్ప (59)ను హత్య చేసిన కొడుకు తరువాత మొబైల్‌లో కరెన్సీ రీచార్జ్‌ చేసుకుని చక్కగా గేమ్స్‌ ఆడుకున్న ఉదంతం ఒకటి కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఎఎస్‌ఐగా రిటైర్డ్‌ అయిన శంకరప్ప కొడుకు రఘువీర్‌ కమ్మార్‌ నిత్యం మొబైల్‌లో హెచ్‌జి గేమ్స్‌ ఆడేవాడు. మొబైల్‌లో గేమ్స్‌కు రఘువీర్‌ బానిస అయ్యాడు. అతని మొబైల్‌లో కరెన్సీఖాళీ అవడంతో మొబైల్‌ రీచార్జ్‌ చేయించాలని, తాను గేమ్స్‌ ఆడుకోవాలని రఘువీర్‌ తండ్రి శంకరప్పను అడిగాడు. ఏ పని చేయకుండా గేమ్స్‌ ఆడటమేమిటి, ఏదైనా పని చేసుకోవాలని తండి శంకరప్ప కొడుకు మందలించాడు.

దాంతో రగిలిపోయిన రఘువీర్‌ తల్లిని గదిలో పెట్టి తాళం వేసి నిద్రపోతున్న తండ్రి తలను కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేవాడు. తండ్రి శంకరప్ప తల, కాళ్లు, చేతులు, మొండెం నరికేశాడు. తరువాత తండ్రి జేబులో ఉన్న డబ్బులు తీసుకుని మొబైల్‌ రీచార్జ్‌ చేసుకుని గేమ్స్‌ ఆడాడు. గదిలో ఉన్న తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులుకు సమాచారం అందించారు. మొబైల్‌ గేమ్స్‌కు బానిసైన రఘువీర్‌ అనేక సార్లు తండ్రితో గొడవపడేవాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వచ్చి రఘువీర్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మీ తండ్రి పోలీసుశాఖలో మంచి పేరు తెచ్చుకున్నాడు, పై అధికారులు ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారు. బుద్ధిగా ఏదైనా పని చేసుకోవాలని పోలీసులు రఘువీర్‌కు బుద్ధి చెప్పారు. రెండువందల రూపాయల కోసం తండ్రినే కిరాతంగా హత్య చేశాడు. పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/