సొంత పార్టీ నేతపై స్మృతి ఇరానీ ఆగ్రహం

మీరు మీ సమస్యను చెప్పాలనకున్నప్పుడు పద్ధతిగా మాట్లాడండి

Smriti Irani
Smriti Irani

న్యూఢిల్లీ: కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సొంత పార్టీ ఎంపిపైనే మండిపడ్డారు. పోక్సో చట్టం2019 బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో బిజెపికి చెందిన ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎంపీ హర్‌నాథ్‌సింగ్‌ యాదవ్‌ అభ్యంతరకరంగా మాట్లాడారు.దీనిపై స్పందించిన స్మృతి ఆయనకు గట్టి క్లాస్‌పీకారు. ఇక్కడ సభలో ఎంతో మంది మహిళలు కూర్చొని ఉన్నారు. వారంతా చాలా ఇబ్బందికి గురవుతారు. మీరు మీ సమస్యను చెప్పాలనకున్నప్పుడు పద్ధతిగా మాట్లాడండిగ అంటూ ఆయన మీద స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/