నామినేషన్‌ దాఖలు చేసిన సోనియా, స్మృతి ఇరానీ

smriti-irani
smriti-irani

లక్నో: కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ, బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ ఈరోజు నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. సోనియాగాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, స్మృతి ఇరానీ అమేథీ నుంచి బరిలో ఉన్నారు. సోనియా, స్మృతి ఇరానీ తమ నామినేషన్లు దాఖలు చేసే కంటే ముందు వేర్వేరుగా హోమం చేశారు. సోనియా వెంట రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. ఈ క్రమంలో సోనియా మాట్లాడుతు ప్రధాని మోడి తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని.. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్తారని సోనియా పేర్కొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/