బాధ్యతలు చేపట్టిన స్మృతిఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌

smriti-irani-ravi-shankar-prasad
smriti-irani-ravi-shankar-prasad

న్యూఢిల్లీ: స్మృతి ఇరానీ ఈరోజు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. స్మృతి ఇరానీ లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ నుండి గెలిచిన విషయం తెలిసిందే. దీంతో స్మృతి ఇరానీకి మోడి
ప్రభుత్వం కీలక బాధ్యతే కెటాయించారు.
మరోవైపు బిజెపి సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా ఈరోజు న్యాయశాఖ, సాధికారత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన సార్వత్రిక ఎన్నికల్లో ఈయన బిహార్‌లోని పట్నా సాహిబ్‌ నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.కాగా రవిశంకర్‌ ప్రసాద్‌తో పాటు వీకే సింగ్‌ కూడా రవాణా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/