ఘోర రోడ్డు ప్రమాదం…16 మంది మృతి

road accident in shajahanpur
road accident in shajahanpur

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ రాష్ట్రం షాజహాన్‌పూర్‌లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
 ప్రధాన రహదారిలో నడుపుతున్న ట్రక్కుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. అదే రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న రెండు టెంపోలను ఢీకొట్టాడు.  దీంతో ప్రమాదంలో పదహారు మంది దుర్మరణం పాలవ్వగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో టెంపోలు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులోని వారిలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేమ అందించాలని ఆదేశించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/