డికె శివకుమార్‌ బెయిల్‌ పెటిషన్‌పై విచారణ

sivakumar
sivakumar


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి డికె శివకుమార్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపున్న సీనియర్‌ నాయకుడు, డికెశివకుమార్‌ను పోలీసులు తీహార్‌ జైలుకు తరలించారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురికాగా ఢిల్లీలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోషియా ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఢిల్లీ పోలీసులు ఆయనను తీహార్‌ జైలుకు తరలించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రస్తుతం తీహార్‌ జైలులో విచారణ ఎదుర్కొంటున్నారు. డికె శివకుమార్‌ను కూడా అక్కడికే తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ.600 కోట్ల రూపాయల అదనపు ఆస్తులను కలిగి ఉన్నారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న శివకుమార్‌ మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆయనపై ఫిర్యాదులు రావడంతో సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/