పార్లమెంట్‌కు వచ్చిన ఆర్థిక మంత్రి తల్లిదండ్రులు

parents of finance minister
parents of finance minister

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టానున్నారు. దీనికోసం ఆమె పార్లమెంట్‌కు కూడా చేరుకున్నారు. బ్రిటిష్‌ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కనబెట్టి బ్రీఫ్‌ కేస్‌కు బదులుగా ఎర్రటి వస్త్రంలో బడ్జెట్‌ పత్రాలను తీసుకొస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆమె చాటిచెప్పారు. కాగా.. నిర్మలమ్మ బడ్జెట్‌ను వినేందుకు ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. పార్లమెంట్‌కు వచ్చిన నిర్మలాసీతారామన్‌ తల్లిదండ్రులను సిబ్బంది, అధికారులు సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు.


తాజా సినీమా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos