సిద్దరామయ్య తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించడం లేదు

Vishwanath and Siddaramaiah
Vishwanath and Siddaramaiah

బెంగళూరు: జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌. విశ్వానాథ్‌ మీడియాతో మాట్లాడతు కాంగ్రెస్‌, జేడీఎస్‌ సమన్వయ కమటి అధ్యక్షుడిగా మాజీ సిఎం సిద్దరామయ్య తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఆరోపించారు. అయితే ఇప్పటికే కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా విశ్వనాథ్‌ వ్యాఖ్యలు మరింత గందరగోళం సృష్టించాయి. నేను కేవలం సిద్ధరామయ్య గురించే మాట్లాడడం లేదు. కూటమి పెద్దగా ఆయన ఇరు పార్టీలను కలుపుకొని పోవాలన్నదే నా వాదన. ఇప్పటివరకు కూటమి నియమ, నిబంధనల్ని రూపొందించలేకపోయాం. ఇవన్నీ అధ్యక్షుడే చేయాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వం చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాను. నాకు సిద్ధరామయ్యకు మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. కూటమి సమన్వయ కమిటీ చీఫ్‌గా ఆయన తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదనేదే నా వాదన అని విశ్వనాథ్‌ అభిప్రాయపడ్డారు.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/