మద్రాస్‌ హైకోర్టులో కిరణ్‌బేడీకి షాక్‌

Kiran Bedi
Kiran Bedi

మద్రాస్‌: పుదుచ్చేరి లెప్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడికి మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర పాలితప్రాంతం రోజువారి కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌గా కిరణ్‌బేడికి లేదని తేల్చి చెప్పింది. పాండిచ్చేరి సిఎం అధికారాల్లో ఎలాంటి పెద్దరికం చేయడం కుదరదని తెలిపింది. అయితే పాండిచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ 2017లో మద్రాస్ హైకోర్టులో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారాలపై, కేంద్రపాలిత ప్రాంతంపై గవర్నర్ పెత్తనం తదితర అంశాలపై ప్రశ్నిస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/