బిజెపి వల్లే రాష్ట్రపతి పాలన

Uddhav Thackeray
Uddhav Thackeray

ముంబాయి: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో శివసేన ఘాటుగా స్పందించింది. ఎన్నికల సందర్భంగా శివసేనకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే పరిస్థితులు ఇంత దాకా వచ్చేవి కాదని వ్యాఖ్యానించింది. బిజెపి తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే మహారాష్ట్రలో పరిస్థితులు రాష్ట్రపతి పాలనకు దారితీశాయంటూ శివసేన విమర్శించింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించారు. ఇరు పార్టీలకు కలిపి ప్రజలు మద్దతు తెలిపారు ఇరుపార్టీలు కలిసి రూపొందించిన విధానాలకే ప్రజలు ఓటేశారు కానీ, బిజెపి దీన్ని అంగీకరించడానికి సిద్దంగా లేదు. ఇంకా శివసేన పార్టీపై ప్రజలకున్న విశ్వాసాన్ని మంటగలపడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించింది. ఈ సందర్భంగా గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీపైనా విమర్శలు ఎక్కుపెట్టింది ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టుకునేందుకు తమకు తగిన సమయం ఇవ్వలేదని ఆరోపించింది. ఆ సమయంలో అనేక మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరని గవర్నర్‌ ఇచ్చిన 24 గంటల సమయం వారి సంతకాలు సేకరించడానికి కూడా సరిపోదని గవర్నర్‌ ఇలా వ్యవహరించడం పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని తీవ్ర ఆరోపణలు చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/