మొదటి రెండేళ్లుఏం చేశారు? శివసేన

SHIV SENA
SHIV SENA

మొదటి రెండేళ్లుఏం చేశారు? శివసేన

ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మొదటి రెండేళ్లలోనే ఈ పనులన్నీ ఎందుకు చేయలేదని శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో సంపాదకీయంలో ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో పలు విషయాల్లో భాజపాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న శివసేన..ఆ దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ కేంద్రంలోని, రాష్ట్రంలోని భాజ పా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రశ్నిం చింది. ఎన్నికల కోడ్‌ రాబోతుందని తెలిసే పరి పాలనలో కీలక మార్పులు చేస్తున్నారని, మొదటి యేడాదిగానీ, రెండో యేడాదిగానీ, అధికారంలోకి రాగానే ఈ పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నిం చింది. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలన్నిం టిని పలు కులాలు, సామాజిక వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయని, వాటి ద్వారా లాభం కంటే వచ్చే ఎన్నికల్లో నష్టమే ఎక్కువగా ఉండోచ్చని అభిప్రాయపడింది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గం తాజాగా వివిధ సంక్షే మ పథకాలకు రూ. 736 కోట్లు కేటాయించడం పైనా అభ్యం తరం వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రక టించిన రిజ ర్వషన్లు అధికారంలోకి రాగానే ఇచ్చి ఉంటే ఆయా వర్గాలు ఇది వరకే లభ్ది పొందేవని వ్యాఖ్యా నించింది.