మహారాష్ట్రం సిఎం పీఠం శివసేనదే

Sanjay Raut
Sanjay Raut


ముంబయి: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి, శివసేన కూటమితో విడిగా కూడా పోటీలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన నాయకులు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి శివసేన చేపడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు సంజ§్‌ురౌత్‌ వ్యాఖ్యానించారు. ముంబయిలోని శివాజీ పార్క్‌్‌ వద్ద జరిగిన దసరా ర్యాలీలో మాట్లాడిన ఆయన ఈ విధంగా అన్నారు. శివసేన ఇప్పుడు కాస్త తగ్గి ఉంటోంది కాని ముందు ముందు ఇలా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమిలో ఉన్నందున కీలక అంశాలు ఆచితూచి మాట్లాడాల్సి వస్తుందని, వచ్చే యేడాది దసరా నాటికి ప్రసుత సిఎం ఫడ్నవీస్‌ ఉద్ధవ్‌ థాకరే పక్కన కూర్చోవాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు మంత్రివర్గంలో ముఖ్యభాగాన్ని సొంతం చేసుకోవాల్సి ఉందన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లిందని ఉద్ధవ్‌ థాకరే అందరికంటే ముందే వ్యతిరేకించారన్నారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ చేయాలన్నది తన కలగా శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాకరే కలగా గుర్తుచేశారు. ఆ కలను నెరవేరేందుకు ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో వాడే మొదటి ఇటుకపై శివసేన పార్టీ పేరు రాయాల్సి ఉంటుందని కూడా సంజ§్‌ు రౌత్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న ఒకే విడదతలో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు చెచెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/