గవర్నర్‌ను కలవనున్న శివసేన

ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం

Bhagat Singh Koshyari
Bhagat Singh Koshyari

ముంబయి: మహారాష్ట్రలో బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకుని పెద్ద పార్టీగా అవతరించింది, కానీ శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత చూపిన విషయం తెలిసిందే. కాగా మరో పెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్‌ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్‌తో శివసేన పార్టీ ప్రతినిధులు సమావేశం జరపనున్నారు. శివసేన శాసన సభాపక్ష నేత ఏక్‌నాథ్‌ షిండే నేతృంత్వంలో ఆ పార్టీ నేతలు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీను కలుసుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కావాలని కోరడంతో పాటు తమ పార్టీకున్న మద్దతుపై గవర్నర్‌కు లేఖను అందజేయనున్నారు. ముంబయిలోని శివసేన భవన్‌లో పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/