తమ పార్టీకి సరైన ప్రాధాన్యం ఇవ్వాలి

Sanjay Raut
Sanjay Raut

న్యూఢిల్లీ: లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు కలిగిన తమ పార్టీకి సరైన ప్రాధాన్యం ఇవ్వాలి. అందువల్ల లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పోస్టును అడగడం సహజమైన కోరికనే ఇది తమ డిమాండ్‌ కాదు అని శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకులు సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ఒకే మంత్రి పదవి కట్టబెట్టడం సరికాదన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పోస్టును బీజూ జనతా దళ్‌కు ఎలా ఇస్తారని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్‌ పోస్టుకు శివసేన పార్టీ సరైన ప్రాధాన్యం కలిగి ఉందని పేర్కొన్నారు. స్పీకర్‌ పోస్టుకు అహ్లువాలియా, రాధామోహన్‌ సింగ్‌, వీరేంద్ర కుమార్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/