శివసేనకు షాక్‌..అబ్దుల్ సత్తార్ రాజీనామా

మహారాష్ట్ర కేబినెట్ లో ఉన్న ఏకైక ముస్లిం మంత్రి

Abdul Sattar
Abdul Sattar

ముంబయి: మహారాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరిగి ఐదు రోజులైనా తనకు శాఖ కేటాయించక పోవడంతో మనస్తాపానికి గురైన మంత్రి అబ్దుల్ సత్తార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చారు. సిల్లోద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొన్నాళ్లు మంత్రిగా పనిచేశాడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఔరంగాబాద్ పార్లమెంటరీ నియోజజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఆయన ఆశల పై కాంగ్రెస్ అధిష్ఠానం నీళ్లు చల్లింది. దీంతో బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా స్థానిక నేతల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఎన్నికల ముందు శివ సేన కండువా కప్పుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/