మాజీ సిఎం షీలా దీక్షిత్‌ కన్నుమూత

Sheila Dikshi
Sheila Dikshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో దిల్లీలో ఆమె కన్నుమూశారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. 1938 మార్చి 31న జన్మించిన ఆమె 15 ఏళ్ల పాటు దిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. కేరళ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. ఆమె మృతికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/