శుక్రవారం మధ్యాహ్నం ఈడీ విచారణకు హాజరవుతా

Sharad Pawar
Sharad Pawar

హైదరాబాద్‌: మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు సంబంధించిన కుంభకోణం కేసులో శుక్రవారం (సెప్టెంబర్ 27) నాడు ఈడీ విచారణకు హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఈ బ్యాంకులో రూ. 25 వేల కోట్ల పెట్టుబడుల అంశంలో శరద్ పవార్ హస్తం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ, ఈడీ విచారణకు సహకరిస్తానని, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్తానని చెప్పారు. ఎవరూ తనను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని… తనంతట తానే వెళ్తానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్నంతా ఈడీకి తెలియజేస్తానని చెప్పారు. తాను ఏ బ్యాంకు లావాదేవీల్లో పాలుపంచుకోలేదని తెలిపారు. తనకు భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/