వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌ అరెస్ట్‌

bengal serial killer
bengal serial killer

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లోని బుర్దాన్‌ జిల్లాలో ఓ ఘనట జరిగింది. సైకో కిలర్ల్‌గా మారి వరుస హత్యలకు పాల్పడుతున్న కామరుజమ్మన్‌ సర్కార్‌(42) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వివరాల ప్రకారం..మే 21వ తేదీన పుతుల్‌ మాజీ అనే మహిళ హత్యకు గురైంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఎరుపు కలరు హెల్మెట్‌ ధరించిన వ్యక్తి రెడ్‌ బైక్‌పై పారిపోవడాన్ని గుర్తించాం. నిందితుడి ఫోటోలను అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించాం. వాహన తనిఖీల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశాం. కాగా ఇదే రీతిలో చంపబడిన మరో నలుగురు మహిళల హత్యకు కూడా ఇతడే కారణంగా భావిస్తున్నామన్నారు. మధ్య వయసు ఒంటరి మహిళలే లక్ష్యంగా ఇతడు హత్యలకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో కరెంట్‌ మీటరు రీడింగ్‌ పేరుతో ఇంట్లోకి ప్రవేశించేవాడు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే తనతో పాటు తీసుకువచ్చిన రాడ్‌, సైకిల్‌ చైన్‌తో మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడేవాడు. ఆపై రక్తపు మడుగులో పడి ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడేవాడు. వారి ప్రైవేటు పార్ట్‌లో పదునైన వస్తువులను చొప్పించి హతమార్చేవాడు. అనంతరం పారిపోయే క్రమంలో ఇంట్లో ఉన్న పలు విలువైన వస్తువులను అపహరించుకుపోయేవాడు. చోరీ ఇతడి తత్వం కాదని.. హత్యలే ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.న్యాయమూర్తి విచారణ నిమిత్తం నిందితుడిని 12 రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/