తుపాకీతో కాల్చుకుని డీసీపీ ఆత్మహత్య

DCP Vikram Kapoor
DCP Vikram Kapoor

ఛండీగఢ్: ఫరీదాబాద్ నగర డిసిపి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఐపిఎస్ అధికారి విక్రమ్ కపూర్ ఫరీదాబాద్ నగర డిసిపిగా విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని పోలీస్ లైన్స్ లోని సెక్టార్ 30లోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విక్రమ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/