రెబల్‌ ఎమ్మెల్యెలున్న హోటల్‌ పరిధిలో 144 సెక్షన్‌

Mumbai Convention Centre Hotel
Mumbai Convention Centre Hotel

ముంబయి: కర్నాటక రాజకీయం ముంబయికి చేరింది. ముంబయిలో రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన ముంబై కన్వెన్షన్ సెంటర్ హోటల్‌లోకి రాకుండా మంత్రి డీకే శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తాజాగా ఆ హోటల్ పరిధిలో 144 సెక్షన్‌ను విధించి మరోసంచలనానికి తెరలేపారు. పోవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు మించి గుమిగూడదంటూ ఆజ్ఞలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించారు. జూలై 9 నుంచి జూలై 12 వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలు కల్పన, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/