రెండోసారి కాశ్మీర్‌కు వెళ్లిన అజిత్‌ దోవల్‌

ajit doval
ajit doval


న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని తొలగించిన అనంతరం అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ మరోసారి కాశ్మీర్‌కు వెళ్లారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ విభజన తరువాత అక్కడికి వెళ్లడం ఇది రెండోసారి. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం పాక్‌ ఆర్మీ దళాలు, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతపై పూర్తి స్థాయి సమీక్షకు ఆయన కాశ్మీర్‌కు వెళ్లారు. అక్టోబరు 31 నుంచి జమ్మూకాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం కానుండటంతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆగస్టు 5న కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి తొలగించిన తరువాత నుంచి 11 రోజులపాటు దోవల్‌ అక్కడే ఉన్న విషయం తెలిసిందే. మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా కనిపించే దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌ టౌన్‌, శ్రీనగర్‌ డౌన్‌టౌన్‌లలో పర్యటించారు. అజిత్‌దోవల్‌ కాశ్మీర్‌ పర్యటన వెనుక భద్రతా కారణాలున్నాయా? లేక కేంద్రం మరో చర్యకు దిగబోతోందా? అన్న చర్చ సాగుతోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/