జాబిల్లికి మరింత చేరువలో చంద్రయాన్‌-2

Chandrayaan 2
Chandrayaan 2

హైదరాబాద్‌: చంద్రయాన్2లోని ల్యాండర్ విక్రమ్గ కక్ష్యను ఈరోజు తెల్లవారుజామున 3:42 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ల్యాండర్‌లోని ప్రొపల్షన్ సిస్టంను 9 సెకన్లపాటు మండించడం ద్వారా దాని కక్ష్యను రెండోసారి విజయవంతంగా తగ్గించారు. ఫలితంగా చంద్రుడి దక్షిణ ధ్రువానికి ల్యాండర్ మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ 35 కిలోమీటర్లు X 101 కిలోమీటర్ల కక్ష్యలో ఉంది. ఆర్బిటర్ 96 కిలోమీటర్లు X 125 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ప్రస్తుతం వీటి పనితీరు బాగానే ఉందని ఇస్రో పేర్కొంది. ఈ నెల 6న అర్ధరాత్రి దాటాక 1:30 2:30 గంటల మధ్య ల్యాండర్ దక్షిణ ధ్రువానికి చేరువలో ల్యాండ్ అవుతుంది. నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు ప్రారంభిస్తుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/