శశిథరూర్‌కు బెయిల్‌ మంజూరు!

shashi tharoor
shashi tharoor, thiruvanantapuram MP


న్యూఢిల్లీ: ప్రధాని మోదిని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చడంపై పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌కే ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. ఆయనను వ్యక్తిగత పూచీకత్తు కింద రూ. 20 వేలు చెల్లించాలని ఆదేశించారు. శశిథరూర్‌పై ఢిల్లీ బిజెపి నేత దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం కేసులో కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరైన శశిథరూర్‌, తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు ఇవాళ బెయిల్‌ మంజూరు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/