చిదంబరానికి సుప్రీంలో ఎదురుదెబ్బ

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయనకు ముందస్తు జామీను ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అంతేగాక ఈడీ సేకరించిన సాక్షాధారాలను ఈదశలో చిదంబరంకు చూపించబోమని, కోర్టులో చిదంబరం చేసిన వాదోపవాదాలకు సంబంధించిన రాత ప్రతులను అందచేయవలసిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆర్థిక నేరాలను అత్యంత తీవ్రమైనవిగా అభివర్ణించిన కోర్టు ఇటువంటి కేసులలో ముందస్తు జామీను ఇవ్వడం కుదరదని పేర్కొంది. ముందస్తు జామీనుకు ఇది అర్హమైన కేసు కాదని, దర్యాప్తు చేసేందుకు ఈడీకి మరింత వ్యవధిని ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. ఈ దశలో ముందస్తు జామీను ఇవ్వడం వల్ల దర్యాప్తునకు అవరోధం ఏర్పడగలదని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు సంబంధిత కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా కోర్టు చిదంబరంకు సూచించింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/